జపాన్‌ వెళ్లిన స్త్రీ

15 Sep, 2020 03:21 IST|Sakshi

రాజ్‌కుమార్‌ రావ్, శ్రద్ధా కపూర్‌ ముఖ్య పాత్రల్లో అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ చిత్రం ‘స్త్రీ’. రాజ్, డీకే ఈ చిత్రకథను అందించారు. 2018లో బాలీవుడ్‌లో వచ్చిన పెద్ద హిట్స్‌లో ఈ సినిమా కూడా ఉంది. 100 కోట్ల పైగా కలెక్షన్లను సాధించింది. తాజాగా ‘స్త్రీ’ జపాన్‌ వరకూ వెళ్లింది. ఈ సినిమా సోమవారం జపాన్‌లో విడుదలయింది. ‘జపాన్‌లోనూ స్త్రీ అందరి మనసుల్ని దోచేస్తుంది’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు