Rakhi Sawant and Adil Khan: మరో అమ్మాయితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన రాఖీ సావంత్ భర్త

5 Feb, 2023 18:42 IST|Sakshi

బాలీవుడ్ నటి రాఖీ సావంత్- ఆదిల్ దురానీ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిల్‌కు మరో అమ్మాయితో సంబంధముందని రాఖీ ఆరోపించారు. అయితే రాఖీ చేసిన ఆరోపణలపై ఆదిల్ ఖాన్ దురానీ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల తన భర్త ఆదిల్ ఖాన్ దురానీకి వివాహేతర సంబంధం ఉందని రాఖీ ఆరోపించింది. 

ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావాలనుకోవడం లేదు. నేను స్త్రీల గురించి మాట్లాడకపోతే  తప్పుగా అర్థం కాదు. నేను నా మతాన్ని గౌరవిస్తాను. అలాగే స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నా.  నేను అలా చేసినట్లు ఆమె చెప్పే విధానం  నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా ఉండటానికి ఇష్టపడను.' అని ‍అన్నారు. కాగా.. అంతలోనే రాఖీ మరో సమావేశంలో తనకు, ఆదిల్ మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉందని తెలిపింది. 

మరిన్ని వార్తలు