చదువు గొప్పదనం నేపథ్యంలో...

10 Oct, 2023 00:01 IST|Sakshi
అభయ్‌ నవీన్, కుశాలిని

‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్‌ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్‌ శ్రీమాన్‌ కీర్తీ అన్నారు. అభయ్‌ నవీన్, అన్వేష్‌ మైఖేల్, పవన్‌ రమేష్, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్‌ నవీన్‌. నటీనటులు కుశాలిని, దయానంద్‌ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్‌ మైఖేల్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్‌ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: ఉమేష్‌ చిక్కు.
 

మరిన్ని వార్తలు