Rakshasa Kavyam: వాయిదా పడ్డ రాక్షస కావ్యం, కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే!

30 Sep, 2023 19:32 IST|Sakshi

అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్‌లో మరింత క్వాలిటీ కోసమే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”.

ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్‌లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. రిలీజ్‌కు ముందే రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు బాగా హిట్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాల్టి ట్రెండ్‌కు కావాల్సిన సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు.

చదవండి: ఆ‍స్తినంతా ఇచ్చేశాను.. సెంటు భూమి లేదు.. లక్షల పారితోషికం అందుకునే రవళి వెండితెరకు ఎందుకు దూరమైందో చెప్పిన హీరోయిన్‌ తల్లి

మరిన్ని వార్తలు