ఆరోగ్యంగా కనిపించాలంటే వ్యాయామం చేస్తే సరిపోదు..

8 Apr, 2021 08:26 IST|Sakshi

‘‘ఆరోగ్యం ఉండడం అంటే సన్నగా ఉండడమో, ప్రతిరోజూ వ్యాయామం చేయడమో కాదు. మన ఆలోచనలు కూడా హెల్దీగా, పాజిటివ్‌గా ఉండాలి’’ అంటున్నారు హీరోయిన్‌  రకుల్‌ప్రీత్‌ సింగ్‌. బుధవారం (ఏప్రిల్‌ 7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా తన ఆలోచనలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు రకుల్‌ప్రీత్‌. ‘‘చూడడానికి మనం ఆరోగ్యంగా కనిపించాలంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. మనం అంతర్గతంగా కూడా చాలా సంతోషంగా ఉండాలి.

ముఖ్యంగా రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకోవాలి. ఎప్పుడూ నీతో  నువ్వు సంతోషంగానే ఉండాలి. నీ శరీరానికీ, మనసుకూ ఏదో ఒక పని చెబుతూనే ఉండాలి. సానుకూలమైన ఆలోచనలను పెంపొందించుకోవాలి. ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మీలోని చిన్నపిల్లాడిని ఎంజాయ్‌ చేయనివ్వండి. ప్రకృతిని ఆస్వాదించనివ్వండి. క్రేజీ థింగ్స్‌ చేయండి. ఫన్నీగా ఉండండి. ఖాళీ సమయాల్లో డిఫరెంట్‌గా ఏదైనా ప్రయత్నించండి. జీవితంలో ఏం చేసినా... సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి’’ అని అన్నారు రకుల్‌. 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు