Rakul Preet Singh: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్​ ప్రీత్​ సింగ్​

2 May, 2022 19:42 IST|Sakshi

Rakul Preet Singh About Working With Amitabh Bachchan Ajay Devgn: టాలీవుడ్​లో అతికొద్ది సమయంలోనే స్టార్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్​ సింగ్. ఈ ఫిట్​నెస్ బ్యూటీ నటించిన తాజా హిందీ చిత్రం 'రన్​ వే 34'. ఈ మూవీలో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, అజయ్​ దేవగణ్​ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి అజయ్​ దేవగణ్​ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విశేషాలను ఇటీవల పంచుకుంది రకుల్​.

ఈ క్రమంలో రకుల్​ను ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్లతో పని చేయడం నటిగా కష్టమనిపించిందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమధానం ఇచ్చింది. నిజానికి కష్టం అనే మాటే నాకు అస్సలు నచ్చదు. నాకంటే ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇక ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి నటిస్తున్నాన్నంటే ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నేను మరింత మెరుగ్గా, బెస్ట్​ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అని రకుల్​ ప్రీత్​ సింగ్​ పేర్కొంది. ఇదిలా ఉంటే రకుల్​ ప్రీత్​ ఛత్రివాలీ, డాక్టర్​ జీ, థ్యాంక్​ గాడ్​ చిత్రాల్లో నటిస్తోంది.  

చదవండి: ఆ స్టార్‌ హీరోకు జోడిగా రకుల్‌ ప్రీత్ సింగ్ ?

మరిన్ని వార్తలు