అడవిలో కథ

15 Aug, 2020 06:11 IST|Sakshi
‌రకుల్‌ప్రీత్‌ సింగ్‌, వైష్ణవ్‌ తేజ్

‘ఉప్పెన’ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా అంగీకరించారు. క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

మరిన్ని వార్తలు