తెరవెనుక ఎన్నో జరుగుతున్నాయ్‌!

1 Jan, 2021 10:31 IST|Sakshi

‘‘కరోనా లాక్‌డౌన్‌కి ముందే ‘తెరవెనుక’ సినిమా పూర్తయింది. థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో విడుదల చేద్దామని దర్శక–నిర్మాతలకు చెప్పాను. క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్, సౌండ్‌ చాలా ముఖ్యం. థియేటర్‌లో అయితేనే ప్రేక్షకులు ఆ అనుభూతిని ఆస్వాదించగలుగుతారు. అందుకని థియేటర్లోనే విడుదల చేద్దామన్నారు’’ అన్నారు అమన్‌. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ కథానాయకుడిగా నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెరవెనుక’. జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్‌ మచ్చ నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతోంది.(చదవండి: శ్రీవారి ముచ్చట్లు @40)

ఈ సందర్భంగా అమన్‌ మాట్లాడుతూ– ‘‘నేటి సమాజంలో మనకు తెలియకుండా తెరవెనుక ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని ఎలా అరికట్టాలి? అనే నేపథ్యంలో మా సినిమా రూపొందింది. ఇందులో కథే హీరో. ఈ సినిమాకి మా అక్క రకుల్‌తో పాటు మంచు లక్ష్మి, మంచు మనోజ్, సందీప్‌ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ... వంటి వారు సపోర్ట్‌ చేశారు.. ఇందుకు వారికి థ్యాంక్స్‌.  తొలిసారి నా సినిమాను బిగ్‌స్క్రీన్‌పై ప్రేక్షకులతో కలిసి చూడటం చాలా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రస్తుతానికి నా ధ్యాసంతా తెలుగు సినిమాలపైనే. మరో రెండు తెలుగు చిత్రాల చర్చలు పూర్తయ్యాయి. ఈ నెలలో అవి ప్రారంభమవుతాయి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు