సమంతకు ఫ్యాన్స్‌ అయిపోయిన రకుల్‌ ఫ్యామిలీ!

8 Jun, 2021 17:20 IST|Sakshi

కరోనాతో థియేటర్లు మూతపడగానే సినీప్రియులు డీలా పడిపోయారు. వినోదానికి వేటు పడినట్లేనా? అని బాధపడ్డారు. కానీ వారి చింతను దూరం చేస్తూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆకాశమంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ముందుకు వచ్చాయి. కొత్త, పాత చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ప్రేక్షకులు కూడా కంటెంట్‌ బాగుండటంతో వెబ్‌ సిరీస్‌కు జై కొడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఫ్యామిలీ మ్యాన్‌ 2 కూడా జనాల నోళ్లలో బాగా నానుతోంది. సమంత తొలిసారి నటించిన ఈ సిరీస్‌లో రాజీ అనే తిరుగుబాటుదారుగా డీ గ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంది. సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా సామ్‌ నటనకు ఫిదా అయ్యారు. టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా సమంత యాక్టింగ్‌కు అట్రాక్ట్‌ అయింది. రకుల్‌ మాత్రమేనా? ఆమె ఫ్యామిలీ మొత్తం సమంతకు ఫ్యాన్స్‌ అయిపోయారట! ఈ విషయాన్ని రకులే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించింది.

'ఫ్యామిలీ మ్యాన్‌ 2 చూశాను. అందరూ బీభత్సంగా నటించారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ అద్భుత నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీ యాక్టింగ్‌కు హ్యాట్సాఫ్‌. రాజీ పాత్రలో జీవించేశావు. ఈ సిరీస్‌ చూశాక నాతో సహా మా కుటుంబం అంతా నీకు అభిమానులుగా మారిపోయారు. మీ టీమ్‌కు శుభాభినందనలు' అని రకుల్‌ ట్వీట్‌ చేసింది.

రాజ్‌ అండ్‌ డీకే రూపొందించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంతతో పాటు ప్రియమణి, షరీబ్‌ హష్మి, సాజిద్‌, మేజర్‌ సమీర్‌, దేవ దర్శిని, ఆనందసామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.

చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన రకుల్‌.. కారణం ఇదేనట!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు