Rakul Preet Singh: గతేడాదే మా పెళ్లి అయిపోయింది.. ఎలా జరిగిందో చెప్పలేదు

22 Feb, 2023 18:40 IST|Sakshi

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ముగిని తేలుతున్న సంగతి తెలిసిందే! ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అప్పుడప్పుడూ మీడియాకు సైతం చిక్కుతుంటారు. అయితే రకుల్‌ ప్రియుడితో పెళ్లికి రెడీ అయిందంటూ తరచూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం సర్వసాధారణమైపోయింది. రకుల్‌ సోదరుడు అమన్‌ సైతం వారి పెళ్లి వార్తలను ధృవీకరించాడని లేటెస్ట్‌గా ఓ రూమర్‌ మొదలైంది. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ.

'నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దాని ప్రకారం నేను గతేడాది నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ మా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనేలేదు? ప్రస్తుతానికి మా బిజీలో మేమున్నాం. పని గురించి తప్ప మాకు వేరే ధ్యాస లేదు' అని క్లారిటీ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను గూగుల్‌లో ఫుడ్‌ గురించి సెర్చ్‌ చేస్తుంటా.. దేంట్లో ఎంత క్యాలరీస్‌ ఉంటాయనేది తెలుసుకుంటా. కేవలం ఫుడ్‌, క్యాలరీస్‌, ఆరోగ్యం గురించే శోధిస్తుంటాను. కానీ నాకు వంట మాత్రం రాదు. పరమ దరిద్రంగా ఎలా వండాలో మీక్కావాలంటే నేను నేర్పిస్తాను. అది అందరికీ రాదు' అని పేర్కొంది రకుల్‌.

మరిన్ని వార్తలు