ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్‌

20 Oct, 2020 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ స్టార్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నెల రోజుల విరామం అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఆమె సోమవారం పాల్గొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ వివారాబాద్‌ అడవుల్లో జరుపుతున్నారు. ప్రస్తుతం కొన్ని రెయిన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా సుశాంత్‌ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్‌ అధికారులు సెప్టెంబర్‌ 25న రకుల్‌ను విచారించిన విషయం తెలిసిందే. సుశాంత్‌ కేసులో రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్‌మెంట్ల ఆధారంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దీపికా పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను కూడా విచారించింది. రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆమె మళ్లీ ఇప్పటి వరకు షూటింగ్‌ పాల్గొనలేదు. చదవండి: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ భామలకు క్లీన్‌ చిట్‌?

తాజాగా మళ్లీ షూటింగ్‌ ప్రారంభించినట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్న సమయంలో సెట్‌లో  క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ గొడుగు పట్టుకొని ఉన్న రెండు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్నారు.‘ వర్షంలో షూటింగ్‌ అంటే కెమెరాలను, మనల్ని మనం రక్షించుకోవాలి. కేవలం కోవిడ్‌ మాత్రమే కాదు హైదరాబాద్‌ వర్షాలను ఎదర్కొని రెయిన్‌ సన్నివేశాలను షూట్‌ చేస్తున్నాం. ఏం జరిగినా పని(షూటింగ్‌) మాత్రం ఆపలేం.’ అని పేర్కొన్నారు. అలాగే రకుల్‌ నితిన్‌ హీరోగా నటిస్తున్న చెక్‌ సినిమాలోనూ రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హిరోయిన్‌గా కనిపించనున్నారు. చదవండి: చివరి షెడ్యూల్లో చెక్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు