నేను రకుల్‌ని కాదు!

17 Sep, 2021 23:24 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 

‘‘వైద్య వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా అనుభూతి కశ్యప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాక్టర్‌ జీ’లో మెడికో స్టూడెంట్‌ ఫాతిమా పాత్ర చేశారామె. ఈ పాత్ర చిత్రీక రణ ఆరంభించక ముందు డాక్టర్స్‌ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌ వంటివి పరిశీలించారట. ఈ విషయం గురించి రకుల్‌ చెబుతూ– ‘‘డాక్టర్‌ జీ’ సినిమా కోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.

డాక్టర్‌ కోటు ధరించగానే ఏదో బాధ్యతాయుతమైన ఫీలింగ్‌ నన్ను ఆవహించేది. నేను నిజమైన డాక్టర్‌ను కాననీ, డాక్టర్‌గా నటిస్తున్నానని తెలిసినప్పటికీ ఫాతిమాగా ఉన్నంత సేపు ఏదో బాధ్యత ఫీలయ్యాను. పాత్ర పరంగా నేను పేషెంట్స్‌ను ట్రీట్‌ చేస్తున్నప్పుడు డాక్టర్స్‌ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో, వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లాక నేను రకుల్‌ని కాదు అనిపించింది. అంతగా లీనమైపోయాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు