అభిమానులకు రకుల్‌ గుడ్‌న్యూస్‌

29 Dec, 2020 15:13 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన అభిమానులకు మంగళవారం గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులో నెగిటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నట్లు, ప్రస్తుతం  తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘కోవిడ్‌ నెగిటివ్‌గా పరీక్షించానని చెప్పడానికి ఆనందంగా ఉంది. నేను పూర్తిగా బాగున్నాను. నాపై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు. మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో 2021ను ప్రారంభించడానికి ఇక ఆలస్యం చేయలేను’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కు ధరించి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చదవండి: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

కాగా గతవార (డిసెంబర్‌ 22)న రకుల్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లానిట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, దయచేసి ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగలరని కోరారు. అందరు జాగ్రత్తగా ఉండాలని ట్విటర్‌ వేదికగా రకుల్‌ విజ్ఞప్తి చేశారు.  కాగా, రకుల్‌ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు