హ్యాపీ హ్యాపీగా... 

13 Feb, 2023 02:34 IST|Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రలో సుమిత్‌ వ్యాస్, సతీష్‌ కౌశిక్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛత్రీవాలి’. తేజస్‌ ప్రభ విజయ్‌ దేవాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 20 నుంచి ఓ ప్రముఖ  ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని హ్యాపీగా ఫీలవుతున్నారు రకుల్‌.

కొత్త ఏడాది తొలి విజయం దక్కడంతో ఆమె ముంబయ్‌లోని సిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు తేజస్‌ ప్రభ విజయ్‌ దేవాస్కర్‌ కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు రకుల్‌. కాగా కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న  ‘ఇండియన్‌ 2’లో చిత్రంలో రకుల్‌ కీలక పాత్ర చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు