మా ఆయన బాగా వండుతాడు: మాధురీ

5 Jan, 2021 12:14 IST|Sakshi

బాలీవుడ్‌ నటి, డ్యాన్సింగ్‌ క్వీన్‌ మాధురీ దీక్షిత్‌ కిచెన్‌లో దూరారు. ఆమె వెంట భర్త శ్రీరామ్‌ నేనే కూడా ఉన్నారు. ఆయన భార్య చేసే వంటకాన్ని దగ్గరుండి చూస్తూ మరాఠీ పదాలను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు గరిటె తిప్పడం ఎంత బాగా వచ్చనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. "చిన్నప్పటి నుంచే నాకు కాస్తో కూస్తో వండటం నేర్చుకున్నా. ఆమ్లెట్‌ వేయడం, పులిహోర చేయడం లాంటివి వచ్చు. కానీ వర్క్‌ బిజీలో పడి వంట చేసే అవకాశం రాలేదు. అయితే పెళ్లయ్యాక మాత్రం ఈ వంటల గురించి బాగా నేర్చుకున్నాను. ఇక నా భర్త రామ్‌కు అమెరికాలో ఫ్రెంచ్‌ వంటగాడు ఉన్నాడు. అలా అతడు అక్కడి డిషెస్‌ నేర్చుకున్నాడు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్‌ అయిన సూపర్‌ స్టార్‌)

ఇక నా విషయానికొస్తే.. భారతీయ వంటకాలను నేను అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా అమ్మ వంటకాలే! నావల్ల రామ్‌ కూడా ఇక్కడి రెసిపీలను ఎంతో కొంత నేర్చుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రామ్‌ నాకంటే బాగా వండుతాడు, అలా అని నేనేమీ చెత్తగా వండనులెండి" అని మాధురీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ‘యాక్ట్రెస్‌’ (నటి)అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్‌ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశేషమేంటంటే.. 23 ఏళ్ల గ్యాప్‌ తర్వాత సంజయ్‌ కపూర్, మాధురీ దీక్షిత్‌ ఈ సిరీస్‌లో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. (చదవండి: కథ రొమాంటిక్‌గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు