రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్‌ లంబోర్ఘిని, చరణ్‌ ఫెరారీ..

27 Aug, 2021 18:02 IST|Sakshi

Jr NTR and Ram Charan RRR Set Wrapping up Video: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల అంత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అద్భుతమైన ఫిచర్స్‌తో తయారు చేసిన ఈ కారును ఖరీదు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా తారక్‌ నిలిచాడు. ఇటీవల ఇంటికి చేరుకున్న ఈ కారు ప్రస్తుతం రోడ్లపై షికారు చేస్తూ కనువిందు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఉక్రెయిన్‌లో కీలక సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దాదాపు మెయిన్‌ షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్కడ పలు లిఫ్ట్‌అప్‌ సీన్స్‌ను చిత్రీకరణ జరుపుకుంటోంది.
(చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్‌ పూర్తి, కానీ..)

ఈ నేపథ్యంలో గురువారం షూటింగ్‌లో పాల్గోన్న ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు షూటింగ్‌ ముగించుకుని ఇంటికి బయలుదేరిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీం షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో తారక్‌ తన లంబోర్ఘిని కారులో ముందు రయ్యిమంటూ దూసుకుపోతుండగా.. వెనకానే చరణ్‌ తన ఫెరారీలో వెళుతున్నాడు. ఈ సీన్‌ అచ్చం రేసును తలపిస్తోంది. ఈ వీడియోకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ‘టైగర్‌ వర్సెస్‌ చీతా’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. మూవీ టీం చెప్పినట్లుగానే ఈ వీడియోలో రెండు కార్లు టైగర్‌, చిరుతలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా కనువిందు చేశాయి.

(చదవండి: అప్పుడే విలన్‌ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్‌ బాబు)

తమ అభిమాన హీరోలు లగ్జరీ కారులో ఇలా వెళుతుండం చూసి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. కాగా దర్శక ధీరుడు రాజమమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో తారక్‌ కోమురం భీమ్‌గా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తుండగా బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌, శ్రియాతో పాటు పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు