వచ్చే నెలలో వైజాగ్‌లో...

26 Aug, 2022 05:14 IST|Sakshi

హీరో రామ్‌చరణ్‌– డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని సెప్టెంబరులో ఆరంభించనున్నట్లు అప్‌డేట్‌ ఇచ్చారు శంకర్‌. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. టాలీవుడ్‌లో      ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్‌ కావడంతో ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆగింది. సెప్టెంబర్‌ 1నుంచి తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌–శంకర్‌ సినిమా కూడా రీ స్టార్ట్‌ కానుంది. ‘‘ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2, రామ్‌ చరణ్‌తో ‘ఆర్‌సి 15’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేశాం. ‘ఆర్‌సి 15’ తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్, వైజాగ్‌లో జరగనుంది. సెప్టెంబర్‌ తొలి వారంలోనే షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అని శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

మరిన్ని వార్తలు