‘జక్కన్న’బర్త్‌డే: ఎన్టీఆర్‌, చెర్రీల స్పెషల్‌ విషెస్‌

10 Oct, 2020 13:35 IST|Sakshi

‘బాహుబలి’తో భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు(అక్టొబర్‌ 10). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ నటీనటులు‘ జక్కన్న’కి స్పెష‌ల్ విషెస్ అందించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్.. రాజ‌మౌళితో దిగిన ఫోటోని  ట్విటర్‌లో షేర్ చేస్తూ, `విష్‌ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్యూ` అని ట్వీట్‌ చేశారు. (చదవండి : ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా!)

​‘విమ‌ర్శ‌కుల‌తోనే ప్ర‌శంస‌లు అందుకునే వ్య‌క్తి రాజ‌మౌళి. నా గురువుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు’ అంటూ రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, చెర్రీల ట్వీట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘ప్రియమైన రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ గురించి తెలుసుకోవ‌డం, మీతో ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మీరు తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో నటిస్తున్నందుకు నేనెంతో గర్వంగా ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు స‌ర్‌’అని అజయ్‌దేవ్‌గణ్‌ అని పేర్కొన్నారు.వీరితో పాటు మ‌హేష్ బాబు, వెంక‌టేష్‌, అలియా భట్‌, రామ్ పోతినేని, ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు రాజమౌళికి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు