కియారా దంపతులకు RC15 సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

13 Feb, 2023 14:53 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్‌ మల్హొత్రతో ఆమె ఈనెల7న ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైసల్మైర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా రామ్‌చరణ్‌ సరసన ‘RC15’ అనే పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అయితేపెళ్లి కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చిన కియారాకు మూవీ టీం క్రేజీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

సిద్-కియారాలకు వెడ్డింగ్‌ విషెస్‌ చెబుతూ మూవీ టీం స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. దీనిపై స్పందించిన కియారా ఈ సర్‌ప్రూజ్‌ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. 


 

మరిన్ని వార్తలు