Ram Charan- Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌ !

23 Jun, 2022 20:02 IST|Sakshi

Is Ram Charan Cameo Role In Salman Khan Movie: ప్రస్తుతం స్టార్‌డమ్‌ ఉన్న హీరోలు అతిథి పాత్రల్లో తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఇతర కథానాయకుల సినిమాల్లో నటిస్తుండటంతో వారిపై ఫ్యాన్స్‌కు అభిమానం మరింతగా పెరిగిపోతోంది. అంతేకాకుండా వారు తళుక్కుమన్న కొద్దిసేపు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటే చాలు అందరికిమించి సినీ లవర్స్‌ ఎక్కువ పండుగ చేసుకుంటున్నారు. ఇటీవల కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' మూవీలో సూర్య 'రోలెక్స్‌'గా అదరగొట్టడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కనిపించింది 3 నిమిషాలే అయిన ఆడియెన్స్‌కు మాములు థ్రిల్‌ ఇవ్వలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్ మూవీలో బాలీవుడ్‌ కండల వీరుడు అతిథి పాత్రలో మెరవనున్న విషయం తెలిసిందే. మరి ఈ పాత్రతో సల్మాన్‌ ఏ మేర అదరగొడతాడో వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఓ సినిమాలో చిన్న కెమియో చేసినట్లు సమాచారం. అది కూడా సల్లూ భాయ్‌ సినిమాలో. అవును సల్మాన్‌ ఖాన్‌ 'కభీ ఈద్‌ కభీ దివాలీ' చిత్రంలో రామ్‌ చరణ్‌ కనిపించనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్‌ హీరో వెంకటేశ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఇందులో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమాలోని పాట షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో సల్లూ భాయితో కలిసి చెర్రీ స్టెప్పులేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాకు పర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. 

చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్‌ వద్ద పరీక్షలు
బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !

కాగా రామ్ చరణ్‌ తండ్రి చిరంజీవి సినిమాలో సల్మాన్‌ గెస్ట్ రోల్‌ చేస్తుంటే, సల్లూ భాయి మూవీలో చెర్రీ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడం విశేషం. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. 

మరిన్ని వార్తలు