రామ్‌చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్‌

5 Mar, 2021 18:17 IST|Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నసినిమా ఆచార్య. ఇందులో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో  చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తి చేసుకున్నారు. 20 రోజుల షూటింగ్‌ పూర్తి చేసిన రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌ పయనమయ్యాడు.

ఈ సందర్భంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చెర్రీతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తుండగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరోవైపు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కి‍స్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది.

చదవండి : (మూవీలో చరణ్‌ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్‌)
(#pspkrana షూటింగ్‌ సెట్‌.. ఫొటో లీక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు