రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు

22 Jun, 2021 16:32 IST|Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 4 మిలియన్స్‌(40 లక్షలు) ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. సౌత్‌ నుంచి నాలుగు మిలియన్స్‌ పైగా ఫాలోవర్స్ కొద్ది మంది హీరోలో రామ్‌ చరణ్‌ ఒకటిగా నిలిచాడు. మిగతా యంగ్‌ హీరోలతో పోలిస్తే సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా కనిపించే చెర్రీ.. ఇటీవల చాలా చురుగ్గా పోస్టులు పెడుతున్నాడు. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. ఇక ట్విటర్‌లో చరణ్‌కు 1.3 మిలియన్స్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం చెర్రీ తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. అలాగే  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

 

మరిన్ని వార్తలు