ఎన్టీఆర్‌ హోస్ట్‌.. చెర్రీ గెస్ట్‌.. రికార్డు టీఆర్పీ రేటింగ్‌కు రెడీ!

16 Jul, 2021 18:01 IST|Sakshi

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. తాజాగా ఈ షో షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఈ రియాల్టీ షో పనుల్లో ఎన్టీఆర్‌ బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ షోకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రియాల్టీ షోకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గెస్ట్‌గా రాబోతున్నారట. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. నిజమయ్యే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి.

ఎందుకంటే.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం.. అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా చరణ్‌ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’షోకి అతిథిగా వెళ్లబోతున్నట్లు సమాచారం. అదికూడా తొలి ఎపిసోడ్‌కే వెళ్లబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆ ఒక్క రోజు తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లో కూడా రికార్డు సృష్టించడం ఖాయం.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. తాజాగా విడుదలైన ఈ మూవీ మేకింగ్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ సందడి చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు