RC15 కోసం మేకోవర్‌.. రామ్‌చరణ్‌ అలా కనిపిస్తాడా? 

19 Jul, 2022 08:46 IST|Sakshi

క్యారెక్టర్‌ ఎలా డిమాండ్‌ చేస్తే ఫిజిక్‌ని అలా మార్చుకోవడానికి రామ్‌చరణ్‌ వెనకాడరు. ఇంతకుముందు కొన్ని చిత్రాలకు మేకోవర్‌ అయిన చరణ్‌ తాజాగా శంకర్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇది యాక్షన్‌ ఓరియంటెడ్‌ మూవీ కావడంతో భారీ ఫైట్స్‌ ఉంటాయి. ఫైట్స్‌ చేయాలంటే ఫిట్‌గా   ఉండాలి. ఆ ఫిట్‌నెస్‌ కోసం, ఒక స్పెషల్‌ లుక్‌లో కనిపించడానికే చరణ్‌ స్పెషల్‌ వర్కవుట్స్‌ చేస్తున్నారని టాక్‌.

అలాగే వయసుపరంగా వివిధ దశల్లో కనిపిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగా ఫిజిక్‌ని మార్చుకుంటున్నారట. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లో ఈ చిత్రం కొత్త షెడ్యల్‌ను ఆరంభించనున్నారు.

మరిన్ని వార్తలు