‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో పాల్గొ‍న్న రామ్‌ చరణ్‌, ఫొటో వైరల్‌

21 Jun, 2021 15:55 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో షూటింగ్‌ పున: ప్రారంభం అయ్యాయి. అన్ని విధాలైన ప్రభుత్వ ప్రొటోకాల్స్‌తో షూటింగ్స్‌ జరుపుకుంటున్నాయి. దీనితో పాటు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ కూడా తిరిగి సెట్స్‌పైకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పాల్గొన్నట్లు ఆయన హెయిర్‌ స్టైలిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్టు షేర్‌ చేశాడు. 

ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హాకీమ్‌ ‘ఈ రోజు తెలంగాణలో లాక్‌డౌన్‌ 2.o ఎత్తివేశారు. దీంతో సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అయ్యాయి. లాక్‌డౌన్‌ అనంతరం నా మొదటి రోజు షూటింగ్‌ హీరో రామ్‌చరణ్‌ హెయిర్‌ స్టైల్‌తో ప్రారంభం అయ్యింది’ అంటూ ఆలిమ్‌ హాకీమ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేశాడు. అంతేగాక చెర్రి కూడా షూటింగ్‌ సెట్స్‌లో రాజమౌళి, ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు తన హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశాడు. 

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల ఆలస్యం అయ్యేలా కనిపిస్తోందంటూ ఇటివల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న సమయానికే ఈ మూవీ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ డ్రామా చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. జూ. ఎన్టీఆర్‌ కోమరం భీంగా, రామ్‌చరణ్‌ సీతారామారాజుగా కనిపించనున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

చదవండి: 
RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేది ఈ అక్టోబరులోనే! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు