RRR OTT Release Date: 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

12 May, 2022 10:53 IST|Sakshi

సినీ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. రామ్‌చరణ్‌, జూ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయ్యింది. ఈనెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కానుంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ కానుంది. మరోవైపు అదే రోజున ఎన్టీఆర్‌ బర్త్‌డే కూడా ఉండటంతో సినీ ఫ్యాన్స్‌ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు