ప్రతి పండుగకు, ప్రత్యేక రోజుల్లో మెగా కుటుంబమంత ఒక చోట చేరి సందడి చేస్తుంది. అదే విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి వేడుక చేసుకున్నారు. అయితే ఈ మెగా కుటుంబ సంబరాల్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించిన దాఖాలాలు లేవు. అందుకే బాబాయిని కలిసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే రామ్ చరణ్‌కు బాబాయితో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి మూవీ ఈవెంట్స్‌లో, పలు ఇంటర్య్వూలలో పవన్‌పై ఉన్న ప్రేమను తరచూ వ్యక్తం చేస్తున్నాడు చెర్రి. (చదవండి: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో నాగ్ సందడి)
ఈ నేపథ్యంలో కటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను సెలబ్రెట్ చేసుకున్న అనంతరం చెర్రి బాబాయ్ ఇంట్లో వాలిపోయాడంట. అనంతరం బాబాయ్‌తో కలిసి ఫొటో తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పండగ వేళ బాబాయ్‌తో చరణ్‌ను చూసి మెగా అభిమానులంతా మురిసిపోతున్నారు. కాగా మెగా కుటుంబ సంక్రాంతి వేడుకలో హీరో నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే.