‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌తో రామ్‌చరణ్‌ మూవీ..నిజం ఏంటంటే..

7 Jun, 2021 00:57 IST|Sakshi

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆ సినిమా తర్వాత ఆయన దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమపై పడింది. వరుసగా స్టార్‌ హీరోలతో పని చేసే అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా చేయనున్నారనే వార్త ప్రచారం లోకి వచ్చింది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తారట రామ్‌చరణ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? ఉండదా? ఉంటే ఏ జోనర్‌లో ఉంటుంది? అసలు ఈ వార్త నిజం అవుతుందా? అంటే కొద్దిరోజులు వేచి చూడాలి మరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు