Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ

24 Apr, 2021 20:08 IST|Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు ప్యాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. మామూలుగా తన సినిమాల్లో హీరోలను వైవిధ్యమైన గెటప్స్‌లో చూపిస్తుంటారు శంకర్‌. రామ్‌చరణ్‌ని కూడా ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని సరికొత్త పాత్రలో.. అది కూడా అతని వయసుకి మించిన పాత్రలో చూపించనున్నారట శంకర్‌.

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. నిజానికి తండ్రి పాత్రలో దక్షిణాదిలో చిరంజీవి, బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో తండ్రి పాత్రను కూడా చరణే చేయనున్నారని టాక్‌. ఇప్పటికే రామ్‌చరణ్‌పై టెస్ట్‌ షూట్‌ కూడా చేశారని, శంకర్‌ సంతృప్తి వ్యక్తం చేశారని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల కథనం. మరి.. చరణ్‌తో శంకర్‌ ద్విపాత్రాభినయం చేయిస్తారా? వేచి చూడాల్సిందే. 
చదవండి:
ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’
ఆమె ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టా.. నాపై నాకే కోపంగా ఉంది: మంచు విష్ణు

మరిన్ని వార్తలు