అతను ఐఏఎస్‌.. ఆమె జర్నలిస్ట్‌!

19 Apr, 2021 04:24 IST|Sakshi

ఐఏఎస్‌ ఆఫీసర్ల విధివిధానాలు, బాధ్యతలు వంటి అంశాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట హీరో రామ్‌చరణ్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమే ఈ ఫోకస్‌. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుందని ఇటీవల ఓ సందర్భంలో చిత్రనిర్మాత ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు.

ఇందులో రామ్‌చరణ్‌ ఏ పాత్ర చేయనున్నారనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. ముందు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చరణ్‌ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నాను తీసుకోవాలనుకుంటున్నారని టాక్‌. ఆమెది జర్నలిస్టు పాత్ర అని సమాచారం. ఓ కీలక పాత్రలో బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ నటించనున్నారట.

చదవండి: ఐపీఎల్‌ సీజన్‌. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు