‌ఎన్టీఆర్‌కు సింగర్‌ కంగ్రాట్స్‌: ఆడేసుకుంటున్న నెటిజన్లు!

28 Mar, 2021 21:08 IST|Sakshi

అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లుక్‌ను అతడి బర్త్‌డేకు ఒకరోజు ముందే(శుక్రవారమే) రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌‌. రామరాజు లుక్‌లో చెర్రీ అదిరిపోయాడంటూ సెలబ్రిటీలు, అభిమానులు పోస్టర్‌పై ప్రశంసలు కురిపించారు. రామరాజుగా మై బ్రదర్‌ రామ్‌చరణ్‌ అంటూ ఈ పోస్టర్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీనికి సింగర్‌ దలేర్‌ మెంది రిప్లై ఇస్తూ.. 'కంగ్రాచ్యులేషన్స్‌ తారక్‌, పోస్టర్‌ చాలా బాగుంది, కీప్‌ ఇట్‌ అప్‌' అని అభినందించాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. అక్కడ రిలీజైంది చెర్రీ పోస్టర్‌ అయితే ఈయన తారక్‌కు శుభాకాంక్షలు చెప్తున్నాడేంటని తలలు పట్టుకున్నారు. వెంటనే ఫ్యాన్స్‌ అందులో ఉన్నది రామ్‌చరణ్‌ అయ్యా! అంటూ కౌంటర్లివ్వడం మొదలుపెట్టారు. రామ్‌చరణ్‌కు, ఎన్టీఆర్‌కు తేడా తెలియట్లేదా? అంటూ కామెంట్లతో ఆడుకున్నారు.

కాగా రామ్‌చరణ్‌ బర్త్‌డే వేడుకలు ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) సెట్స్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెర్రీ చేత కేక్‌ కట్‌ చేయించింది చిత్రయూనిట్‌. మరోవైపు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చెర్రీ బర్త్‌డే వేడుకలు జరిపారు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ ఫొటో షేర్‌ చేస్తూ.. ఈ ఏడాది మా ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. నీతో గడిపిన సమయాలు ఎప్పటికీ సంతోషకరమైనవే బ్రదర్‌. హ్యాపీ బర్త్‌డే అని రాసుకొచ్చారు.

చదవండి: 'రామరాజు'గా రామ్‌చరణ్‌ పోస్టర్‌ విడుదల

లగ్జరీ కారు కొన్న ప్రభాస్‌! ఖరీదు: అక్షరాలా ఏడు కోట్ల రూపాయలట!

'‌‌ఆర్‌ఆర్‌ఆర్'‌ నుంచి రామ్‌చరణ్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు