రవితేజ టాప్‌ ఫాంలో ఉన్నారు: రామ్‌చరణ్‌

13 Jan, 2021 19:48 IST|Sakshi

‘క్రాక్‌’ చిత్రబృందంపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రశంసలు కురిపించారు. సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశానంటూ కితాబిచ్చారు. తన అభిమాన నటుడు రవితేజ ప్రస్తుతం టాప్‌ ఫాంలో ఉన్నారని, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించారు. సముద్రఖని, వరలక్ష్మీశరత్‌ కుమార్‌ తమ నటనతో అదరగొట్టారన్నారు. ఇక థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయిందన్న చెర్రీ.. గోపీచంద్‌ సినిమాను తెరక్కించిన విధానం అద్భుతం అంటూ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన థమన్‌, డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్రాక్‌ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి బహుమతి అందించామని, ఇందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.(చదవండి: ‘క్రాక్‌’ మూవీ రివ్యూ)

కాగా మాస్‌రాజా ర‌వితేజ, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం క్రాక్‌. తొలుత సినిమా విడుదలలో కాస్త జాప్యం నెలకొన్నప్పటికీ అన్ని అవాంతరాలు దాటుకుని రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఈ సినిమా గురించి సానుకూలంగా స్పందించడంతో థాంక్స్‌ అన్నా అంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా సినిమా రిలీజ్‌కు ముందు మెగా కాంపౌండ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా రవితేజకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా