‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌: చిట్టిబాబు చింపేశాడుగా

21 Apr, 2021 20:47 IST|Sakshi

క్రియేటీవ్‌ దర్శకుడు సుకుమార్‌- రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు.

తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతుంది. ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. చెర్రీ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, దేవీశ్రీ ప్రసాద్‌ అద్భుత నేపథ్య సంగీతంతో ట్రైలర్‌ అదిరిపోయింది. తమిళనాడులో 300లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు