Ramcharan- Shankar Movie: చెర్రీ- కియారాల పాటతో ప్రారంభం?

21 Jan, 2022 09:52 IST|Sakshi

Ram Charan and Kiara Advani Shoot Start With Song: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిన్న బ్రేక్‌ తర్వాత ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణతో ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు