Ram Charan: వైజాగ్‌లో రామ్‌చరణ్‌.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌

9 May, 2022 09:17 IST|Sakshi

ప్రముఖ సినీ నటుడు రామ్‌ చరణ్‌ ఆదివారం మధురవాడలో సందడి చేశారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా పాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ మూడు రోజుల నుంచి ఆర్‌కే బీచ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో మధురవాడలో పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

రామ్‌చరణ్‌ మధురవాడ వచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరిలివచ్చారు. హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షూటింగ్‌ అనంతరం ఇక్కడకు వచ్చిన అభిమానులతో రామ్‌చరణ్‌ కాసేపు ముచ్చటించారు.

మరిన్ని వార్తలు