ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండగే!

5 Apr, 2021 00:58 IST|Sakshi

‘మగధీర, బ్రూస్‌లీ’ చిత్రాల్లో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మెగాఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లో రామ్‌చరణే హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్‌ రోల్‌ చేశారు. అలాగే చిరంజీవి నటించిన ‘ఖైదీ నం. 150’లో ఓ పాటలో కనిపించారు చరణ్‌. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్‌చరణ్‌ పూర్తి స్థాయి నిడివి ఉన్న లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కానుంది.

అయితే ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌  ఏంటంటే... రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేయనున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే మెగాఫ్యాన్స్‌కు పండగే. మరి.. మరోసారి చిరంజీవి, రామ్‌చరణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా? అనేది చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు కుదర్లేదు. మరి... ఆ తరుణం వచ్చిందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు