సిద్ధ వచ్చేశాడు.. ఆచార్య కొత్త టీజర్‌ చూశారా ?

28 Nov, 2021 16:35 IST|Sakshi

Ram Charan Teaser Out From Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ 'సిద్ధ' పాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేశారు. సిద్ధ పాత్రలో రామ్‌ చరణ్‌ ఒదిగిపోయాడు. టీజర్‌లో రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. ఇంతేకాకుండా ఈ టీజర్‌లో అనేక విషయాలు పొందుపరిచారు. 'ధర‍్మస్థలికి ఆపద వస్తే, అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని రామ్‌చరణ్‌ డైలాగ్‌ చెప్పినతీరు ఆకట్టుకుంటుంది. ఇక టీజర్‌ ఎండింగ్‌లో వచ్చే సీన్‌ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తుంది.  

ఆచార్య నుంచి ఇదీవరకు వచ్చిన టీజర్‌, సాంగ్స్‌ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన సిద్ధ పాత్రకు సంబంధించిన ఈ టీజర్‌ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చూస్తే తెలుస్తోంది. మెగస్టార్‌ చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటించగా, రామ్‌ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది. ఈ చిత్రంలో 'మ్యాన్‌ అఫ్‌ హ‍్యుమానిటీ' సోనూసూద్‌ కీలక పాత్ర పోషించారు. అలాగే ఇంతకుముందు రిలీజైన లాహే లాహే.. పాటలో సీనియర్‌ హీరోయిన్ సంగీత కనిపించిన సంగతి తెలిసిందే. 


ఇది చదవండి: ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్‌ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం

మరిన్ని వార్తలు