Ram Gopal Varma : నేను మంచి కొడుకును కాదమ్మా.. అంటూ ఆర్జీవీ పోస్ట్‌

8 May, 2022 13:32 IST|Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా అది వెరైటీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బర్త్‌డే సహా ప్రతీ వేడుకను సెలబ్రేట్‌ చేసుకుంటున్న వర్మ తాజాగా మదర్స్‌ డే రోజున అపురూమైన ఫోటోను షేర్‌ చేశారు. 'హ్యాపీ మదర్స్‌ డే అ‍మ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి'.. అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

ఇందులో ఆర్జీవీ చేతిలో గ్లాస్‌ పట్టుకొని కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు కూడా విషెస్‌ చెబుతున్నారా.. అంతే ఆర్జీవీ ఎప్పటికీ అర్థం కాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు