ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్‌

17 Sep, 2020 18:41 IST|Sakshi

ముంబై: డ్రామాలాడుతుందంటూ తనను విమర్శించిన నటి ఊర్మిళ మటోండ్కర్‌పై కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఊర్మిళను సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌గా అభివర్ణించారు. ఓ నటిగా కంటే ఈవిధంగానే ఆమెకు గుర్తింపు వచ్చిందంటూ వివాదానికి తెరతీశారు. కాగా ముంబైపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న కంగ‌న.. తొలుత త‌న స్వ‌స్థ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ మాద‌క‌ద్ర‌వ్యాలకు మూలం అన్న సంగ‌తి తెలుసుకోవాల‌ంటూ ఊర్మిళ హితవు పలికిన సంగతి తెలిసిందే. పెద్ద‌గా నోరేసుకొని మాట్లాడినంత మాత్రాన కంగన మాట్లాడేవ‌న్నీ నిజాలు అయిపోవ‌ంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరికత తెలిసిన అమ్మాయి ఎవరూ ఇలా మాట్లాడరంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.( చదవండి: గ‌ట్టిగా అరిస్తే అన్నీనిజాలు అయిపోతాయా ?)

ఇక ఈ విషయంపై స్పందించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. మాటల్లో తాను ఎవరితో పోటీపడలేనని, అయితే ఊర్మిళ విలక్షణమైన నటిగా తనను తాను నిరూపించుకున్నారన్నారు. రంగీలా, సత్య, కౌన్‌, భూత్‌, ఏక్‌ హసీనా థీ తదితర సినిమాల్లో సంక్లిష్ట పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారంటూ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. (చదవండి: ‘ఐటెమ్‌ సాంగ్‌ ఛాన్స్‌ రావాలంటే అలా చేయాలసిందే’)

కాగా ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగీలా సినిమాతో ఊర్మిళ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాల్లో రామ్‌గోపాల్‌ వర్మ హీరోయిన్‌గా ఆమెకు అవకాశం ఇచ్చారు. అంతేగాక తన పుస్తకం ‘గన్స్‌ అండ్‌ థైస్‌’లో ఊర్మిళ అందాన్ని వర్ణిస్తూ ఆమె ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఇక ఊర్మిళపై కంగన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఊర్మిళ నన్ను వ్యభిచారి అన్నపుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు. ఫెమినిజం అంటే ఇదేనా అంటూ మరోసారి విరుచుకుపడ్డారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా