ఎందుకీ ఖర్మ అనిపించిన వర్మ సినిమాలు..

6 Apr, 2021 20:54 IST|Sakshi

"లక్కుతో శివ సినిమా తీసి.. షోలేని చెడగొట్టి.. పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ
హిచ్‌కాక్‌ సినిమాలు చూసి.. దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్‌వర్మ.. డైరెక్టరా ఖర్మ.." 
ఇది రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్‌ చేసిన సినిమాలో ఆయన మీదే ఆయనే వేసుకున్న సెటైర్‌.

ఆయన ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తాడో, ఎప్పుడు ఎవరి మీద కౌంటర్లు వేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఆయన పేరు చెప్తే యూత్‌లో ఓ వైబ్రేషన్‌. శివ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్‌ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీసుకుంటూ పోయాడు. ఇప్పటికీ అదే చేస్తున్నాడు కూడా. రేపు(బుధవారం) ఆర్జీవీ బర్త్‌డే. ఈ సందర్భంగా "అయ్యో వర్మ.. మాకేందుకీ ఖర్మ" అని బాధపడేలా జనాలకు తలపోటు తెప్పించిన ఆర్జీవీ సినిమాలు ఏంటో చదివేద్దాం..

డార్లింగ్‌: హారర్‌, రొమాన్స్‌, థ్రిల్‌ అన్ని అంశాలు కలగలిపి వచ్చిన చిత్రమిది. ఇషా డియోల్‌, ఫర్దీన్‌ ఖాన్‌, ఇషా కొప్పికర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనాలను పెద్దగా మెప్పించలేకపోయింది.

మేరీ బేటి సన్నీ లియోన్‌ బనా చాతీ హై: టైటిల్‌తోనే సినిమా ఏంటనేది మీకీపాటికే అర్థమై ఉంటుంది. సన్నీలియోన్‌లా పోర్న్‌ స్టార్‌ కావాలనుకుంటున్నానని ఓ అమ్మాయి పేరెంట్స్‌కు చెప్తుంది. నైనా గంగూలీ, మక్రంద్‌ దేశ్‌పాండే, దివ్య జగ్డాలే ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఐస్‌క్రీమ్‌: నవదీప్‌, తేజస్వి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఐస్‌క్రీమ్‌ తింటే పీడకలలు వస్తాయనేది కథ. ఈ కాన్సెప్టు, టేకింగ్‌, ట్విస్టులు లేసి సీన్లు, సాదాసీదా హారర్‌.. అన్నీ ప్రేక్షకులకు పరమ బోరింగ్‌ తెప్పించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

డర్నా మానా హై: ఇది కూడా హారర్‌ జానర్‌లో వచ్చిందే. ఆరు చిన్న కథల సమ్మేళనమే ఈ సినిమా. సైఫ్‌ అలీఖాన్‌, వివేక్‌ ఒబేరాయ్‌, అఫ్తబ్‌ శివదాసని, శిల్పా శెట్టి, సమీరా రెడ్డి, నానా పటేకర్‌ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.

ఈ సినిమాలే కాకుండా ఈ మధ్యకాలంలో బోలెడన్ని సినిమాలు వరుసపెట్టి చేసుకుంటూ పోయారాయన. అందులో కొన్ని ఎప్పుడొచ్చాయో, ఎప్పుడెళ్తున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం హీరోయిన్ల అందాలను, పాత యాక్షన్‌ సీన్లపైనే ఆధారపడుతూ ప్రజలకు బోర్‌ కొట్టిస్తూ.. వర్మ ఎందుకో వెనుకబడుతున్నాడు.

చదవండి: వైరల్‌ : హైదరాబాద్‌ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్లు

కొడుకు ఫొటోతో థియేటర్‌కు, కన్నీరు ఆగడం లేదు

మరిన్ని వార్తలు