నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ

11 May, 2021 16:51 IST|Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ.. పరిచయమే అక్కర్లేని పేరు ఇది. తన విభిన్నమైన వ్యక్తిత్వంతో అందరిని ఆశ్చర్యపరిచే వర్మ.. తనదైన శైలిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇతరుల పోస్టులపై వ్యంగ్య రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తాడు. అంతేకాదు పలు ఇంటర్వ్యల్లో కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదానికి తెరలేపే ఆర్జీవీ తన చావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి షాకిచ్చిన ఓ పాత వీడియో తాజా మరోసారి వైరల్‌ అవుతోంది. అయితే భార్య, కూతురు ఉన్నప్పటికీ ఆర్జీవీ వారికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న సంగతి తెలిసిందే. 

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన చావుకు తానే సుపారీ ఇచ్చుకున్నానంటూ వ్యాఖ్యానించారు. గతంలోని ఈ వీడియో కరోనా నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘వర్మ పిచ్చి పరాకాష్టకు ఇది మరో ఉదాహరణ’, ‘మాకేంటి ఈ కర్మ.. వర్మ’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా యాంకర్‌ ఆర్జీవీతో.. మనిషికి తప్పనిసరిగా ఏదో సమయంలో ఎదుటి వారి అవసరం ఉంటుంది కదా, మరెందుకు మీరు ఒంటరిగా ఉంటున్నారని అడగ్గా.. తానేప్పడు ఎదుటి వారిపై ఆధారపడనని జవాబు ఇచ్చారు. 

‘ఒక మనిషి తనకు తానుగా ఏపని చేసుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తి అవసరం ఉంటుంది. అది అనారోగ్యం బారిన పడి పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్నప్పుడే. ఒకవేళ అలాంటి పరిస్థితి నాకు వస్తే నన్ను వెంటనే చంపేయమని ఓ వ్యక్తికి సూపారీ ఇచ్చాను. నేను అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమైన రోజున ఆ వ్యక్తి నన్ను చంపేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తను చనిపోయాక చూడటానికి రావొద్దని తన కూతురికి చెప్పానని, తన కోసం ఏడవద్దని కూడా చెప్పానంటూ వర్మ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు