రామ్‌ గోపాల్‌ వర్మ డీ కంపెనీ ట్రైలర్‌ వచ్చేసింది..

5 Mar, 2021 17:45 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసిన చిత్రమే డీ కంపెనీ. హిందీ ట్రైలర్‌ను బుధవారమే రిలీజ్‌ చేసిన ఆయన తాజాగా నేడు(శుక్రవారం) తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇందులో దావూద్ ఇబ్రహీం‌ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది చూపించారు.

మనం పైకి రావడానికి ఛాన్స్‌ ఉంది, రిస్క్‌ కూడా ఉంది అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది. తుపాకీల మోత, కత్తులతో నరుక్కోవడాలు.. చూస్తుంటే రక్తపాతాలు, బీభత్సాలు, హింస విపరీతంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల పాత పద్ధతులనే రిపీట్‌ చేస్తూ రొటీన్‌ అనిపిస్తోంది. ఇందులో వర్మ మార్క్‌ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. సాగర్‌ మాచనూరు నిర్మిస్తున్న ఈ సినిమాకు పౌల్‌ ప్రవీణ్‌ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: వర్మ ‘డీ కంపెనీ’ టీజర్‌ 

గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా

మరిన్ని వార్తలు