హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘నఘం’.. టీజర్‌ విడుదల

17 May, 2022 17:21 IST|Sakshi

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ‘నఘం’ టీజర్ 

గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'నఘం'. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఒక్క డైలాగ్‌ లేకుండా.. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కట్‌ చేసిన ఈ టీజర్‌.. అందరిని ఆకట్టుకుంటుంది.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు కావాల్సిన సంగీతాన్ని భగవత్‌ అందించారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు