Aamir Khan Divorce: ‘వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకోవాలి, ఎందుకంటే..

5 Jul, 2021 15:27 IST|Sakshi

Aamir Khan-Kiran Rao Divorce: బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ అమీర్‌ఖాన్‌-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌ జరిగిన వెంటనే ఇంటర్నెట్‌లో ట్రోలింగ్‌ మొదలైంది. నెటిజన్లంతా అమీర్‌ ఖాన్‌ విడాకులపైనే చర్చ పెట్టారు. నెగెటివ్‌ కామెంట్లతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ స్టార్‌ కపుల్‌ విడాకులపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. వారిద్దరికీ భవిష్యత్తు మరింత అందంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావుని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్ల ఫైర్‌ అయ్యాడు ఆర్జీవి. వాళ్లకి లేని బాధ మీకేంటని నెటిజన్లను ప్రశ్నించారు. 

‘అమీర్‌-కిరణ్‌రావు ఎలాంటి బాధ లేకుండా విడిపోతే.. మిగతా వాళ్లందరూ ఎందుకు ఇబ్బందిపడుతున్నారు. వాళ్ల గురించి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు?. ట్రోలర్స్‌.. వ్యక్తిగత విషయాలపై పిచ్చిగా ట్రోల్‌ చేస్తున్నారు. కానీ అమీర్‌- కిరణ్‌ జంట మాత్రం వ్యక్తిగతంగా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. అమీర్‌, కిరణ్‌ రావు భవిష్యత్తులో కూడా సంతోషంగా, ఇంతకుముందు లేని విధంగా ఇకపై మీ జీవితాలు మరింత రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో ముడిపడిఉన్నది. కానీ విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని’ అని ఆర్జీవీ వరుస ట్వీట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు