RGV-Ashu Reddy: అషురెడ్డి కాలును ముద్దాడటంపై వర్మ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్‌

11 Dec, 2022 12:59 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ డేంజరస్‌. డిసెంబర్‌ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆర్జీవీ, అషురెడ్డితో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇంటర్య్వూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో ఆర్జీవీ, అషు కాళ్లను ముద్దాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్‌ కోసం, పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా? అంటూ ఆర్జీవీని, అషును నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అంతేకాదు ఆర్జీవీకి పిచ్చి పట్టిందని, మతి పోయిందంటూ వర్మను ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న నెగిటివిటీపై తాజాగా వర్మ స్పందించాడు.

చదవండి: ఘనంగా సీరియల్‌ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్‌

ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ఈ సందర్భంగా అషురెడ్డి కాలును ముద్దాడటంపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ వీడియో నేను ఎవరినీ ఉద్దేశించి చేయడం లేదు. ఇంటర్వ్యూలో నేను అషురెడ్డి  ఆమె కాలిని ముద్దు పెట్టుకోవడం వెనక కారణం, అలా ఎందుకు చేశాను అనే నా ఉద్దేశాన్ని మాత్రమే చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇంకేవరిక కోసం కాదు, ఒకరికి వివరణ ఇచ్చుకోవడానికి అసలే కాదు. టీనేజ్‌ వయసు దాటాక ఓ వ్యక్తికి తనకంటూ వ్యక్తిగత జీవితం, ఇండివిజువాలిటీ ఉంటుంది. ఈ ఇంటర్య్వూలో మేం మాట్లాడింది, చేసింది అంతా మా ఇద్దరికి ఒకరిఒకరికి అభ్యంతరం లేకుండా చేసిందే.

అది మా వ్యక్తిగతం. దాన్ని మిగతా వాళ్లు చూడొచ్చు.. చూడకపోవచ్చు. ఇంకా ఏమైన అనుకోవచ్చు’ అన్నాడు.  అనంతరం ‘‘ప్రతి ఒక్కరు బతకడానికి కష్టపడతారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది అవసరం. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కొందరు స్పోర్ట్స్ ఆడతారు, ఇంకొందరు పేకాట ఆడుతారు. ఇంకా సినిమా చూడటం.. ఇలా వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్కటీ ఎంచుకుంటారు. నేను ఓ అందమైన అమ్మాయితో ఇలాంటి కాన్వర్జేషన్‌ చేయడం. నేను కోరుకునే ఎంటర్‌టైమెంట్‌లో ఇదొకటి. ఇందులో నన్ను జడ్జి చేసే రైట్స్‌ ఎవరికి లేదు.

చదవండి: మహేశ్‌ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్‌, రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..!

మీకు నచ్చకపోతే చూడకండి. మీకు వేరే పనులు లేవా? ప్రతిరోజు మీకు నచ్చని ఎన్నో సంఘటనలు ఉంటాయి. వాటిని వదిలేయడం లేదా? ఇలాకే ఈ విషయాన్ని వదలేయండి. ఇది చూసి వాడి మతి పోయింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ టైంలో నేను ఏం ఫీల్‌ అయ్యానో అదే చేశానే. ఎప్పుడైన సరే నేనేం ఫీల్‌ అవుతానో అదే మాట్లాడతాను. అషురెడ్డి కాళ్లను ముద్దాడటం కూడా అంతే’’ అంటూ ఆర్జీవీ చేప్పుకొచ్చాడు. ఇక చివరికి నేను చెప్పే ఫిలాసఫీ ఏంటంటే ‘నా చావు నేను చస్తా.. మీ చావు మీరు చావండి’ అంటూ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు