Ram Gopal Varma: షారుక్‌ పని అయిపోయిందంటూ ట్వీట్‌.. చివర్లో ట్విస్ట్‌!

27 Jan, 2023 14:39 IST|Sakshi

బాక్సాఫీస్‌ పని అయిపోయింది. హిందీ సినిమాలు ఆడే రోజులు పోయాయి. స్టార్‌ హీరోలు రిటైర్‌మెంట్‌ తీసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందే! కోట్లల్లో కలెక్షన్లు రాబట్టడం కేవలం కలే.. అన్నమాటలకు చెక్‌ పెట్టాడు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌.. అతడు ప్రధాన పాత్రలో నటించిన పఠాన్‌ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల పైచిలుకు గ్రాస్‌ రాబట్టి బాయ్‌కాట్‌ గ్యాంగ్‌కు చెంపపెట్టు సమాధానమిచ్చింది

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దీనిపై వెరైటీగా స్పందించాడు. '1. ఓటీటీలు వచ్చాక థియేటర్‌లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం కష్టమే. 2. షారుక్‌ ఖాన్‌ పని అయిపోయింది. 3. దక్షిణాది డైరెక్టర్స్‌లా.. బాలీవుడ్‌ కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్స్‌ సాధించడం జరగని పని. 3. కేజీఎఫ్‌ 2 మొదటిరోజు కలెక్షన్స్‌ బ్రేక్‌ చేయడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది... ఈ అపోహలన్నింటినీ పఠాన్‌ పఠాపంచలు చేసింది' అని ట్వీట్‌ చేశాడు. వర్మ పఠాన్‌ మూవీని ఓవైపు విమర్శిస్తున్నట్లుగా కనిపించినా చివరాఖరికి మాత్రం మెచ్చుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: హనీరోజ్‌ను గుర్తుపట్టారా? 15 ఏళ్ల క్రితమే తెలుగులో!
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సంచలన ఆరోపణలు చేసిన నరేశ్‌

మరిన్ని వార్తలు