Ram Gopal Varma: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌..

13 May, 2022 15:16 IST|Sakshi

Ram Gopal Varma Says Bollywood Should Make Films Only For OTT: సంచనాల డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. నిత్యం సెలబ్రిటీలను, ఇండస్ట్రీపై సెటైరికల్‌గా కామెంట్స్‌ చేస్తూ కవ్విస్తూ ఉంటాడు. అందరికంటే భిన్నంగా వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తారు. సెన్సేషన్‌ కామెంట్స్‌ చేయండలో కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు వర్మ. ఇటీవల సౌత్‌ ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్, పుష్ప కేజీఎఫ్‌ 2 సినిమాలు విడదలై సూపర్‌ సక్సెస్‌ సాధించగా, ఆర్జీవీ బాలీవుడ్‌పై వరుస కామెంట్లు చేసిన విషయం తేలిసిందే. తాజాగా 'బాలీవుడ్ నన్ను భరించలేదు' అని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో మరోసారి షాకింగ్ కామెంట్స్‌ చేశారు ఆర్జీవీ. 

థియేటర్లలో సౌత్ ఇండియా చిత్రాలు సక్సెస్‌ సాధించడం, నార్త్‌ మూవీస్‌ పరాజయం పొందడం చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీల కోసమే సినిమాలు తెరకెక్కించే పరిస్థితి కనిపిస్తోంది. అని రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరీ ఇప్పుడు ఈ వాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌, బాలీవుడ్‌ పాపులర్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ మధ్య జరిగిన ట్వీట్స్‌ వార్‌ తెలిసందే. 

చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్‌, బాలీవుడ్‌ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్‌


మరిన్ని వార్తలు