ఎన్టీఆర్‌, అఖిల్‌పై ఆర్‌జీవీ షాకింగ్‌ కామెంట్స్!‌‌

9 Apr, 2021 10:41 IST|Sakshi

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తరచూ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిల్లుస్తుంటాడు. రాజకీయ నాయకులైన, సినీ ప్రముఖలపై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతుంటాడు. అలాంటి ఆర్జీవీకి ఇసారి హీరో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌ అక్కినేని చిక్కారు. గతంలో ఓ మూవీ ఈవెంట్‌లో జూనీయర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌ సరదగా చమత్కరించుకున్న వీడియోను పట్టెసి వారిని ఆడుకున్నాడు.

ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘ఇక హీరోయిన్ల భవిష్యత్తుపై నాకు ఆందోళనగా ఉంది. సో సాడ్‌’ అంటూ ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. ఇందులో ఎన్టీఆర్,‌ అఖిల్‌లు మట్లాడుతూ సరదగా నవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌, అఖిల్‌ తొడపై చేయి వేసి గిల్లగా.. దీనికి అక్కినేని వారసుడు సిగ్గుతో నవ్వుతు కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక దీనిపై ఎన్టీఆర్‌, అక్కినేని అభిమానులు తమదైన శైలి స్పందిస్తున్నారు.

చదవండి: 
RGV Anthem‌: నో థ్యాంక్స్‌ అంటున్న వర్మ

అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ 

ప్రముఖ డ్యాన్స్‌ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు