కరోనా రాకుంటే ఈ సినిమానే ఉండేది కాదు : వర్మ

5 Dec, 2020 17:00 IST|Sakshi

కరోనా సమయంలో అందరు దర్శకులు ఇంటికే పరిమితమైతే వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలకు బీజీ అయిపోయాడు. లాక్‌డౌన్‌లో సైతం సినిమాలు తీసి ‘పే అండ్‌ వ్యూ’ (ఆన్‌లైన్‌లో  డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేసి ఔరా అనిపించాడు. అలాగే కొన్ని పెద్ద సినిమాలను సైతం నిర్మించాడు. వాటిని థియేటర్లు తెరవగానే విడుదల చేస్తానని ముందే ప్రకటించారు. తాజాగా కరోనా మహమ్మారినే కథగా చేసుకొని ‘కరోనా వైరస్‌’ అనే సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ మూవీని ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో సినిమా థియేటర్ల ప్రారంభం తరవాత వర్మ చిత్రమే తొలి డైరెక్ట్‌ మూవీగా విడుదల అవుతుంది.
(చదవండి : ఆసక్తి రేపుతున్న ‘కరోనా వైరస్‌’ రెండో ట్రైలర్‌)

కరోనా నా సమయంలోనే అతి  తక్కువ సిబ్బందితో 'కరోనా వైరస్' మూవీని నిర్మించాడు వర్మ. వంశీ చాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అగస్త్య మంజు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ డిసెంబర్ 11న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. వర్మ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ రాకుంటే అసలు ఈ సినిమానే వచ్చేది కాదన్నారు. షూటింగ్‌ మొత్తం లాక్‌డౌన్‌ సమయంలోనే చేశామన్నారు. కరోనా సమయంలోనూ తనను నమ్మి సినిమా చేసిన దర్శకుడు మంజు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో  మిగతా ఫిల్మ్‌ మేకర్స్‌ అంతా ఇంట్లో ఉండి వంటలు చేస్తూ, మొక్కలకి నీళ్లు పోస్తు టైమ్ పాస్ చెస్తే ,తాము మాత్రం సినిమాలు తీశామని, కరోనా వైరస్ దీవెనలు తమకు ఉన్నాయని, దాని వలనే ఎవరు కరోనా వైరస్ భారీన పడకుండా కరోనా వైరస్ సినిమాను తీయగలిగామని, ఈ మహమ్మారికి తాను బుణపడి ఉన్నానన్నారు.

మరిన్ని వార్తలు