సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ

17 Jun, 2021 21:39 IST|Sakshi

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. వివాదస్పద దర్శకుడు ఆర్జీవీని చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియాన ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టిన అరియాన తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. హౌజ్‌లో తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఆమె. ఇదిలా ఉండగా ఇటీవల అరియాన, అర్జీవీలకు సంబంధించిన జిమ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. 

అరియానతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్‌లో ఆమెతో కలిసి కసరత్తులు చేసిన ఫొటోలను ఆయన షేర్‌ చేయడంతో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ ఇంటర్య్వూకు సంబంధించిన అప్‌డేట్‌ కానీ ప్రోమో కానీ బయటకు రాలేదు. తాజాగా ఆర్జీవీ దీనిపై సోషల్‌ మీడియా వేదికగా ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘హే అరియాన నువ్వు ఇచ్చిన బోల్డ్‌ ఇంటర్య్వూ టీజర్‌ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నాం’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

చదవండి: 
లవ్‌ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు